పెళ్లిళ్ల సీజన్ వేళ మగువలకు శుభవార్త. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550.. 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,760గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. గత రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. నేడు రూ.1000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.93,000గా ఉంది. సోమవారం దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,200
విజయవాడ – రూ.72,200
ఢిల్లీ – రూ.72,350
చెన్నై – రూ.72,200
బెంగళూరు – రూ.72,200
ముంబై – రూ.72,200
కోల్‌కతా – రూ.72,200
కేరళ – రూ.72,200
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,760
విజయవాడ – రూ.78,760
ఢిల్లీ – రూ.78,910
చెన్నై – రూ.78,760
బెంగళూరు – రూ.78,760
ముంబై – రూ.78,760
కోల్‌కతా – రూ.78,760
కేరళ – రూ.78,760
Also Read: AP Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,02,000
విజయవాడ – రూ.1,02,000
ఢిల్లీ – రూ.93,000
ముంబై – రూ.93,000
చెన్నై – రూ.1,02,000
కోల్‌కతా – రూ.93,000
బెంగళూరు – రూ.93,000
కేరళ – రూ.1,02,000