పసిడి ప్రియులకు గుడ్న్యూస్. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దాంతో మొత్తంగా గత నాలుగు రోజులుగా పసిడి రేట్స్ పెరగలేదు. బులియన్ మార్కెట్లో బుధవారం (మే 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,350గా.. 24 క్యారెట్ల ధర రూ.97,480గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: Bhatti Vikramarka: స్వామి ఆశీస్సులతోనే నేను ఈస్థాయిలో ఉన్నా!
మరోవైపు వెండి ధర కూడా గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉంది. ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.1,00,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,11,000గా నమోదయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ఒక లక్షగా ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన డీటెయిల్స్ ఇవి. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.