పసిడి ధరలు ఓ రోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఇవాళ స్వల్పంగా పెరిగింది. తులం గోల్డ్ పై రూ. 160 పెరిగింది. బంగారం ధరలు పెరగగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 562, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,765 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Lokesh Kanagaraj : లోకేశ్ కనగరాజ్ నెక్ట్స్ సినిమాల పరిస్థితి ఏంటి.?
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరగడంతో రూ. 87,650 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరగడంతో రూ. 95,620 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,770 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:ఉత్తరాదిన కొనసాగుతున్న టెన్షన్.. పలు విమాన సర్వీసులు రద్దు
సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,09,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 97,900 వద్ద ట్రేడ్ అవుతోంది.