Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండవ రోజు తగ్గిన బంగారం ధరలు

  • పసిడి ప్రియులకు శుభవార్త.
  • వరుసగా రెండవ రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు.
  • నేడు 10గ్రా. బంగారం ధర రూ.81,930 వద్ద ట్రేడ్.
Gold Rates

Gold Rates

Gold Rates: ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత రోజు రోజుకి పెరుగుతూ మరోసారి 10 గ్రాముల బంగారం ధర 80 వేలకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 83 వేల వరకు కూడా ధర చేరుకుంది. ఇకపోతే, గత రెండు రోజుల నుంచి బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పడ్డాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల 320 రూపాయలు తగ్గి రూ.81,930 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 300 రూపాయలు తగ్గి 75,100 ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 240 రూపాయలు తగ్గి 61,450 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా వెండి ధరలు కూడా తగ్గినట్లుగా కనబడుతోంది.

Also Read: HYDRA: అమీన్ పూర్‌లో హైడ్రా అధికారుల కూల్చివేతలు

కేజీ వెండి ధర దేశవ్యాప్తంగా 1000 రూపాయల మేర తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి 1,03,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, కేరళ, చెన్నై నగరాలలో కేజీ బంగారం ధర రూ. 1,03,000 వద్ద కొనసాగుతుండగా.. మిగతా ప్రాంతాలలో 98 వేల వద్ద ట్రేడ్ అవుతోంది.