గోల్డ్ ధరలు వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు మళ్లీ భారీగా పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 210 పెరిగింది. కిలో సిల్వర్ ధర రూ. 100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,609, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,725 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగింది. దీంతో రూ.97,250 వద్ద అమ్ముడవుతోంది.
Also Read:US-Russia: రష్యాపై తీవ్ర ఆంక్షలకు అమెరికా రంగం సిద్ధం.. ట్రెజరీ కార్యదర్శి సంకేతాలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 210 పెరిగింది. దీంతో రూ. 1,06,090 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,400 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,240 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,36,100 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,26,100 వద్ద ట్రేడ్ అవుతోంది.