US-Russia: రష్యాపై తీవ్ర ఆంక్షలకు అమెరికా రంగం సిద్ధం.. ట్రెజరీ కార్యదర్శి సంకేతాలు
- రష్యాపై తీవ్ర ఆంక్షలకు అమెరికా రంగం సిద్ధం
- అమెరికా ట్రెజరీ కార్యదర్శి సంకేతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాపై తీవ్ర ఆంక్షలకు అమెరికా రంగం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోవడంతో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Gurgaon: భారీ వర్షంతో గురుగ్రామ్ అతలాకుతలం.. 7 కి.మీ ట్రాఫిక్ జామ్.. వాహనదారులు బెంబేలు
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ చర్చలు ఫలించలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగారు. పుతిన్, జెలెన్‌స్కీతో విడివిడిగా చర్చలు జరిపారు. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ఇలా చర్చలు జరుగుతుండగానే రష్యా.. ఉక్రెయిన్‌పై వైమానిక దాడులకు పాల్పడుతోంది. దీంతో ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. శాంతి చర్చలకు పుతిన్ ముందుకు రాకపోవడంతో రష్యాపై మరిన్ని ఆంక్షలకు ట్రంప్ పరిశీలిస్తున్నట్లు స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. ఈ మేరకు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటి వరకు ట్రంప్ ఓపికతో నిరీక్షించారని.. ఆ కారణంతోనే ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు. కానీ రష్యా మాత్రం పదే పదే బెదిరింపులకు దిగుతోందని.. ఈ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించాలని చూస్తున్నట్లు స్కాట్ బెసెంట్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. చెల్లిని ప్రేమించాడని ఓ అన్నయ్య ఘాతుకం.. ప్రియుడిని బయటకు తీసుకెళ్లి..!
రష్యా శాంతిని నిరాకరిస్తే ఆంక్షలతో శిక్షిస్తామని ఇటీవలే ట్రంప్ హెచ్చరించారు. ఇది ప్రపంచ యుద్ధం కాదని.. ఆర్థిక యుద్ధం అవుతుందని తెలిపారు. ఇక రష్యా లొంగకపోవడంతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్న ఆలోచనతో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందానికి మరొక మార్గం ఉన్నట్లుగా అమెరికా భావిస్తున్నట్లు సమాచారం.
ఇక భారత్-అమెరికా వాణిజ్య ఘర్షణను త్వరగా పరిష్కరించుకోవాలని ఆమెరికా భావిస్తోందని స్కాట్ బెసెంట్ అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు వాణిజ్య సమస్యను పరిష్కరించుకుంటాయని తెలిపారు. అయితే రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని స్కాట్ బెసెంట్ తప్పుపట్టారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఆజ్యం పోస్తోందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..