Goa Hit And Run Case: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన ట్రక్.. కిలోమీటర్ అవతల తల..
- గోవాలోని పోండాలో హిట్ అండ్ రన్ కేసు..
- మృతుడి తల కిలోమీటరు దూరంలో లభ్యం..
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goa Hit And Run Case: గోవాలోని పోండాలో హిట్ అండ్ రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. పర్- ఖండేపర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని 10 చక్రాల ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి శరీరం రెండు ముక్కలుగా విరిగిపోయింది. మృతుడి తల కిలోమీటరు దూరంలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన విషయం డ్రైవర్‌కు తెలియదని పోలీసు అధికారులు చెబుతున్నారు. మృతుడి తల లారీ టైర్లలో ఇరుక్కుపోవడంతోనే అంత దూరం వెళ్లే అవకాశం ఉందన్నారు.
Read Also: MLA Danam Nagender: మల్లారెడ్డితో సహా 20 మంది కాంగ్రెస్ లోకి.. దానం కీలక వ్యాఖ్యలు..
Also Read
కాగా, మృతుడి తల ధాత్వాడ- ఉస్గావ్ రోడ్డులోని ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ సమీపంలో లభ్యమైంది. ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసు అధికారులు చెప్పడంతో లారీ డ్రైవర్‌కు విషయం తెలిసింది. వాస్తవానికి, అతను సంఘటన స్థలం నుంచి ముందుకు వెళ్లి ఉస్గావ్ రబ్బర్ ఫ్యాక్టరీ లోపల వెహికిల్ ను నిలిపాడు. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు తమ కళ్లతో ప్రమాదాన్ని చూశామని పోలీసులకు చెప్పారు. వేగంగా వచ్చిన ట్రక్కు పాదచారులపై నుంచి దూసుకెళ్లిందన్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడి పై నుంచి ట్రక్ వెళ్లిందన్నారు.
Read Also: OPPO F27 Pro Plus 5G Price: మొదలైన సేల్.. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్‌పై భారీ డిస్కౌంట్!
అయితే, మృతుడు ఆనంద్ ధరమ్ నాయక్‌గా పోలీసులు గుర్తించారు. ఈతడు పోండా నివాసిగా గుర్తించారు. తొలుత ఇది హిట్ అండ్ రన్ కేసుగా పోలీసు అధికారులు ఫైల్ చేశారు. సంఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాగా.. అందులో ట్రక్కు రబ్బరు ఫ్యాక్టరీలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. నిందితుడు ట్రక్ డ్రైవర్‌ను ధన్నానాథ్ జోగిగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి స్వస్థలం రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లా నివాసిగా గుర్తించిన పోలీసులు లారీని సీజ్ చేశారు.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!