Global Hunger Index 2023: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశ పరిస్థితి మరింత దిగజారింది. 125 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 111వ స్థానానికి చేరుకుంది. ఇది మాత్రమే కాదు, పిల్లల పోషకాహార లోపం కూడా భారతదేశంలోనే ఉంది. ఇది 18.7 శాతంగా నమోదైంది. భారతదేశం పరిస్థితి 2022 సంవత్సరం నుండి మరింత దిగజారింది. గత సంవత్సరం భారతదేశం ఈ సూచికలో 107వ స్థానంలో ఉంది. నేడు విడుదల చేసిన ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారతదేశం స్కోరు 28.7 శాతం. ఇది ఆకలి పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న వర్గంలోకి వస్తుంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) అనేది ప్రపంచ, ప్రాంతీయ, జాతీయ స్థాయిలలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, ట్రాక్ చేయడానికి వాడే ఒక సాధనం.
Read Also:Galaxy A34: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,999కే లభిస్తున్న స్మార్ట్ ఫోన్స్..త్వరపడండి..
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం.. భారతదేశం ఇతర పొరుగు దేశాలైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ కంటే వెనుకబడి పోయింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో పాకిస్థాన్ 102వ స్థానంలో, బంగ్లాదేశ్ 81వ స్థానంలో, నేపాల్ 69వ స్థానంలో, శ్రీలంక 60వ స్థానంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికను గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం అంటే వరుసగా 2 సంవత్సరాలు పూర్తిగా తిరస్కరించింది. ప్రపంచ ఆకలిని లెక్కించడానికి పిల్లలపై మాత్రమే దృష్టి సారించే కొలమానాలను ఉపయోగించరాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకలిని కొలవడానికి ఇది తప్పు మార్గం అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. GHI 2022కి సంబంధించి, ఆకలిని లెక్కించడానికి ఉపయోగించే 4 పద్ధతులలో, 3 పిల్లల ఆరోగ్యంపై మాత్రమే ఆధారపడి ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also:Chandrababu Health Condition: చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?