పండగ సీజన్ కొనసాగుతుంది.. ఈ క్రమంలో అన్ని ఆన్లైన్ వ్యాపార సంస్థలు కొన్ని ప్రోడక్ట్స్ పై భారీ ఆఫర్ ను ప్రకటించాయి.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ కంపెనీలు డీల్స్, డిస్కౌంట్‌ల వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ నుంచి బ్యాగులు, దుస్తుల వరకు భారీ తగ్గింపు ఆఫర్ లను అందిస్తున్నాయి.. స్మార్ట్ ఫోన్ల పై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటిస్తున్నారు. శామ్‌సంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లిస్ట్ అయింది. ఈ డివైజ్‌ను కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది కరెక్ట్ టైం అనే చెప్పాలి..
ఇక ఈ ఫోన్ మన దేశంలో మొదట రూ.30,999 తో లాంచ్ చేశారు..అయితే ఇది ఇప్పుడు రూ.27,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.2,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆప్షన్ ఉపయోగించుకుంటే ఫోన్ ధర రూ.25,999కి తగ్గుతుంది. మరో ఇ-కామర్స్ పోర్టల్ అమెజాన్‌లో సైతం ఈ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. గెలాక్సీ A34 5G ఫోన్ 8GB + 128GB ఎడిషన్ ధర రూ.27,999కి తగ్గింది.. బ్యాంక్ లేదా ఈఏంఐ ల వల్ల మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది..
శామ్‌సంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్, వైడ్ కలర్ సపోర్ట్‌తో హై-క్వాలిటీ 6.6 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ అయింది. వైబ్రెంట్ కలర్స్‌ను, ఎంజాయబుల్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది రోజంతా బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌తో వస్తుంది.. కెమెరా కూడా 13 ఎంపీ సెల్ఫీల కోసం అందిస్తున్నారు.. ఈ ఫోన్‌కు శామ్‌సంగ్ ఆండ్రాయిడ్ 17 OS వరకు అప్‌డేట్‌లను అందిస్తుంది. అయితే శామ్‌సంగ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది ఫోన్‌తో పాటు రాదు. ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. దీనికి ఛార్జింగ్ అనేది రాదు.