HCA Health Care : హైదరాబాద్ లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్
- హెచ్‌సీఏ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్
- హెల్త్ కేర్ రంగంలో మరో ముందడుగు
- 400
- 000 చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెల్త్‌కేర్‌లో ప్రపంచంలో పేరొందిన హెచ్‌సీఏ హెల్త్‌కేర్ హైదరాబాద్ లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించిన ఈ సంస్థ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్ కు నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. అమెరికా పర్యటనలో హెచ్‌సిఎ హెల్త్‌కేర్‌కు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో తమ హెల్త్ కేర్ సేవల విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రభుత్వం తగిన మద్దతు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో హెచ్‌సిఎ హెల్త్‌కేర్ తన కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు సంతోషం వ్యక్తపరిచారు. దీంతో కొత్త ఉద్యోగాలు లభించటంతో పాటు హెచ్సిఏ పెట్టుబడులు తెలంగాణను ఆరోగ్య సంరక్షణ రంగంలో మరింత ముందుకు తీసుకువెళుతుందన్నారు.
Vinesh Phogat-Gold Medal: గోల్డ్ మెడల్ తీసుకువస్తా.. మాటిచ్చిన వినేశ్ ఫొగాట్!
Also Read
- Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
- Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
- Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..
హైదరాబాద్ లో హెచ్‌సీఏ ఏర్పాటు చేసే గ్లోబల్ సెంటర్ అర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తో పాటు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అనలిటిక్స్ రంగంలో ప్రతిభకు పెద్దపీట వేయనుంది. హెచ్‌సీఏ హెల్త్‌కేర్ గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలకమైన హబ్ గా ఉపయోగపడుతుంది. ఈ చర్చల సందర్భంగా హెచ్‌సిఎ హెల్త్‌కేర్ గ్లోబల్ కెపాబిలిటీస్ నెట్వర్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్ మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి తమ విజన్‌కు అనుగుణంగా ఉన్న హైదరాబాద్‌లో హెల్త్ కేర్ సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రతిబా వనరులు, మౌలిక సదుపాయాలు కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ కు బలమైన పునాదులు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధిస్తుందని, హెచ్‌సీఏకు ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ గ్లోబల్ సెంటర్ త్వరలోనే పని ప్రారంభిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. బ్రిటన్ తో పాటు ఇరవై దేశాల్లో పలు శస్త్రచికిత్స కేంద్రాలతో పాటు, అత్యవసర సంరక్షణ కేంద్రాలు , ఫిజిషియన్ క్లినిక్‌లతో దాదాపు 188 ఆసుపత్రులు, 2,400 ఆంబులేటరీ సైట్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది.
AP MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థిగా పీలా గోవింద సత్య?
తాజావార్తలు
-
Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ 2026 వచ్చేసింది.. 360° కెమెరా, రియర్ సీట్ మసాజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
-
IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
-
Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
-
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!