EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నప్పుడు డబ్బులు ఖర్చు లేకుండా చేసుకున్న పండుగలన్నీ ఇప్పుడు టికెట్ తీసుకుని చేసుకుంటున్నారు.. పండుగలు, సంస్క్రతి పెట్టుబడిదారులను పెంచిపోషించడానికే ఉన్నాయ్ ఏమో అనిపించేలా వ్యవహారం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఆర్టిషిఫియల్ ఆనందాలే కనిపిస్తున్నాయ్ తప్ప ప్యూరిటీ లేని సంతోషాల కోసం డబ్బులు వదిలించుకుంటున్న జనాలను చూస్తే జాలేస్తోంది.. కొంతమంది హెచ్చుల కోసం పండుగలను నిర్వహిస్తున్నారు.. స్పెషలీ హైదరాబాద్‌లో ఏ పండుగ చూసినా హంగామానే కనిపిస్తుంది కానీ.. పండుగ అసలు స్వభావం మాత్రం మారిపోయింది. పైగా పక్కింటోళ్లు ఏదో కొన్నారని..ఫ్రెండ్ ఇంకేదో తీసుకున్నాడని మిడిల్‌క్లాస్ ప్రజలు అప్పులు చేసి మరీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
పండుగకి కొత్త ఫోన్ కొనాలి. కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలి. మనసుకు నచ్చిన వాళ్లకు మంచి బహుమతులు ఇవ్వాలి. పండగ సమయంలో ఇలాంటి కోరికలు సహజమే. చేతిలో డబ్బులు లేకపోయినా ఈఎంఐ సౌకర్యం ఉందిగా, తర్వాత నెలనెలా కట్టేయొచ్చులే అనుకుంటాం. కానీ ఆ చిన్న ఈఎంఐ వెనుక మీ కుటుంబ ఆర్థిక పరిస్థితినే మార్చేసే అప్పు దాగి ఉంటే?
Also Read
- FSSAI: చిన్నారులకు చక్కెర పెడుతున్నారా?
- Explainer: యుద్ధంలోకి మరో ముస్లిం దేశం..తగలబడుతున్న మధ్యప్రాచ్యం!
- IPCC: 1000మంది సైంటిస్టులు..100 గంటలు.. ఒక్కటే తీర్పు.. ముందుంది ముసళ్ల పండగ!
- Lawrence Bishnoi History: కాలేజ్ స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్ దాకా.. పోలీస్ కొడుకు లారెన్స్ బిష్ణోయ్ హిస్టరీ ఇదే..!
డెట్ రిజల్యూషన్ ప్లాట్‌ఫామ్ ఎక్స్పర్ట్ ప్యానెల్ సేకరించిన వివరాల ప్రకారం ప్రకారం, అప్పులు తీసుకున్నవారిలో దాదాపు 60 శాతం మందికి నెలవారీ ఈఎంఐలు కుటుంబానికి వచ్చే మొత్తం ఆదాయానికి దాదాపు సమానంగా ఉంటున్నాయి లేదా అంతకంటే ఎక్కువగా ఉంటున్నాయి.
అంతేకాదు, ఇప్పటికే తీసుకున్న అప్పుల వాయిదాలు కట్టడం కోసం 40 శాతం మంది మళ్లీ కొత్త అప్పులు తీసుకుంటున్నారు లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అంటే పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ప్రజలు ఇంతగా అప్పులపై ఆధారపడటానికి కారణం ఖర్చుల సరదా మాత్రమేనా? అలా అనుకోవడానికి వీల్లేదు. ఇదే నివేదిక ప్రకారం, 26 శాతం మంది వైద్య ఖర్చులు, ఆరోగ్య సమస్యల కోసం అప్పులు తీసుకుంటున్నారు. పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ అవసరాల కోసం 22 శాతం మంది అప్పులు చేస్తున్నారు. వ్యాపార అవసరాలు, ఉద్యోగం కోల్పోవడం వంటి కారణాలతో 18 శాతం మంది, ఇంటి ఖర్చులు, రోజువారీ అవసరాల కోసం మరో 15 శాతం మంది అప్పుల బాట పడుతున్నారు.
ఇప్పటికే కుటుంబ అవసరాల కోసం అప్పులు చేస్తున్నవారికి పండగ ఖర్చులు అదనపు భారంగా మారవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం పోవడం లేదా జీతం తగ్గడం వల్ల 31శాతం మంది అప్పులు తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ డేటా చెబుతోంది.
ఆదాయంతో పోలిస్తే ఈఎంఐలు ఎక్కువగా ఉండటం 28శాతం మందికి సమస్యగా మారింది. ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్ల 19 శాతం మంది, వైద్య లేదా కుటుంబ అత్యవసర పరిస్థితుల వల్ల మరో 12 శాతం మంది వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక అప్పు వాయిదా కట్టడానికి మరో అప్పు తీసుకుంటే, వచ్చే నెల ఖర్చులకు మరింత డబ్బు అవసరమవుతుంది. అప్పుడు ఇంకో అప్పు చేయాల్సి రావచ్చు. ఇలా అప్పుల చక్రంలో చిక్కుకుంటే బయటపడటం కష్టమవుతుంది.
పండగ ఖర్చుల విషయంలో భావోద్వేగాలు, కుటుంబ సభ్యుల అంచనాలు కూడా ప్రభావం చూపిస్తాయని ఎక్స్పర్ట్ ప్యానెల్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రా చెబుతున్నారు. అందుకే కొత్త అప్పు తీసుకునే ముందు ఇప్పటికే కడుతున్న ఈఎంఐలు, వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాల్సిన మొత్తం, భవిష్యత్తులో వచ్చే ఖర్చులను లెక్కలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరి పండగ కోసం అప్పు తీసుకోవచ్చా? అత్యవసరమైతేనే తీసుకోవాలి. వాయిదా కట్టిన తర్వాత ఇంటి ఖర్చులకు, అనుకోని అవసరాలకు డబ్బు మిగులుతుందా అనేది ముందే చూసుకోవాలి. అవసరం లేని కొనుగోలును కొంతకాలం వాయిదా వేయడం కూడా మంచి నిర్ణయమే. ఎందుకంటే పండగ సంబరాలు కొన్ని రోజుల్లో ముగిసిపోతాయి.
కానీ వాటి కోసం తీసుకున్న అప్పు మాత్రం నెలల తరబడి మీ ఆదాయంలో కొంత భాగాన్ని తీసుకుంటూనే ఉంటుంది. అందుకే కొత్త వస్తువు కొనేముందు ఒక్క విషయం ఆలోచించండి. అది మీ జీవితానికి నిజంగా అవసరమా? లేదా కొన్ని రోజుల ఆనందం కోసం రానున్న నెలల ప్రశాంతతను పణంగా పెడుతున్నారా?
తాజావార్తలు
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
-
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!