Viral Video: దాహం వేసి నీటి కోసం కష్టపడుతున్న కుక్క.. ఓ మహిళ ఏం చేసిందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అది వైరల్ అయిపోతుంది. మంచైనా, చెడైనా నిమిషంలో అందరికీ చేరిపోతుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ అయ్యాక ఎక్కడ ఏది కనిపడిన వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా, కొన్ని చిరాకు తెప్పించేలా ఉంటాయి. మరికొన్ని ప్రేమకు ప్రతిరూపంలా ఉంటాయి. ఇంకొన్ని మానవత్వానికి అద్దం పట్టేలా ఉంటాయి. ఇలా మానవత్వానికి సంబంధించిన ఓ మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె దయాగుణాన్ని చాలా మంది మెచ్చకుంటున్నారు.
Also Read: Delhi Metro: మెట్రోలో రెచ్చిపోయిన అబ్బాయి.. మొదట ఓ అమ్మాయితో తరువాత ఇంకో అమ్మాయితో
Also Read
సాధారణంగా మన ఇళ్లలో పెంచుకునే కుక్కలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వాటికి తిండికి, నీటికి కొదవలేకుండా చూస్తాం. అయితే వీధి కుక్కల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వాటికి తిండి పెట్టే వారు నీరు పోసే వాటి ఆలనా పాలనా చూసే వారు ఎవరు ఉండరు. అయితే దాహంతో బాధపడుతూ నీటిని తాగడానికి ప్రయత్నిస్తున్న ఓ కుక్కకు అటుగా వెళుతున్న ఓ మహిళసాయం చేసింది. వీడియోలో ఓ కుక్కకు దాహం వేసి నీరు తాగడం కోసం నీళ్ల కుళాయి దగ్గరకు వస్తుంది. అయితే దాని ట్యాప్ ను ఎలా తిప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది. ఇంతలో ఓ మహిళ వచ్చి ట్యాప్ ను ఓపెన్ చేస్తుంది. మొదట నీరు తాగటానికి భయపడిన కుక్క తరువాత కడుపునిండా నీరు తాగి అక్కడి నుంచి వెళుతుంది. ఎవరో దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దయ చూపించడం అనేది గిఫ్ట్ లాంటిది దానిని ఎవరైనా ఖర్చు లేకుండా ఇవ్వొచ్చు అంటూ వీడియో క్యాప్షన్ పెట్టారు. నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంచి పని చేశావని కొందరు పొగుడుతుంటే.. దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని మరికొందరు పేర్కొంటున్నారు. దయా గుణం అనేది చాలా గొప్పదని అనేక మంది కామెంట్ చేస్తున్నారు.
- Tags
- girl
- help
- street dog
- viral video
- Water
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!