NTV Telugu Site icon

China: పెళ్లి చేసుకోవడం ఈజీ.. విడాకులంటే కష్టం

China Population

China Population

చైనా చాలా కాలంగా జనాభా రేటు తగ్గుదలపై ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన చైనా ఈ సమస్యను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా రేటును పెంచడానికి చైనా అనేక చర్యలు తీసుకుంటోంది.. జనాభాకు ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తోంది. జనాభాను పెంచేందుకు వీలుగా వివాహ ప్రక్రియను సులభతరం చేసి.. విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యలు అక్కడి జనాల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

Bhogapuram: భోగాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఏపీ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి తనిఖీ

జననాల రేటు గణనీయంగా తగ్గకుండా నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. వివాహానికి దరఖాస్తు చేసుకునే జంటల నుండి చైనీస్ అధికారులు ఇకపై హుకౌ లేదా గృహ నమోదు అవసరం లేదు. ఈ కొత్త ప్రతిపాదిత చట్టంలో విడాకులను తగ్గించడానికి 30-రోజుల కూలింగ్ పీరియడ్‌ అందిస్తున్నారు, ఈ సమయంలో భార్యా భర్తలు ఇద్దరిలో ఎవరైనా ఒకరు విడాకులు తీసుకోవడానికి ఇష్టపడకపోతే, వారు దరఖాస్తును ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత విడాకుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నిలిపివేస్తారు. ఈ నిబంధన ఇప్పటికే 2021లో అమలులోకి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో విడాకులు తీసుకోవడం మరింత కష్టతరంగా మారింది.

BCCI: భారత్లో ఉమెన్స్ వరల్డ్ కప్ నిర్వహణకు అనుమతి నిరాకరణ.. కారణం ఇదే..!

మరో ప్రతిపాదనలో వివాహాలను రిజిస్ట్రర్ చేయడానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాంతీయ పరిమితులను తొలగించింది, ఇకపై వివాహాలకు హౌస్‌హోల్డ్‌ రిజిస్ట్రర్‌ అవసరం లేదని పేర్కొంది. ఈ క్రమంలో అక్కడి జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజల ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. చైనా ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ.. ఈ చట్టాల వలన వివాహం, కుటుంబం ప్రాముఖ్యతను ప్రోత్సహించినట్లవుతుందన్నారు. అలాగే విడాకులను తగ్గించడం, సామాజిక స్థిరత్వాన్ని సమర్థించడం, వివాహాల పట్ల చట్టబద్ధమైన హక్కులను మెరుగ్గా రక్షించడం సాధ్యమవుతుందని తెలిపారు. కాగా.. చైనాలో యువత పెళ్లి విషయంలో పెద్దగా ఉత్సాహం చూపడం లేదని వార్తు వస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో కేవలం 34.3 లక్షల జంటలు మాత్రమే పెళ్లి చేసుకున్నాయి. ఇది 2013 నుండి చూసినట్లయితే చాలా అత్యల్పంగా ఉంది.