Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD ” మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు .ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది.
Read Also :Venkatesh : వెంకీ మూవీ కోసం వైజాగ్ లో అనిల్ రావిపూడి..?
ఈ సినిమాలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు.ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకి సరికొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామని అనుభూతి కలుగుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలు తెలియజేసాడు.”కల్కి కథ అన్నింటికీ క్లైమాక్స్.. ఎప్పుడూ అన్ని వెస్ట్ లోనే జరగాలా ?ఈ కథ ఎలా వెళ్తుంది అనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్ ” అని ఈ చిత్రం కథ గురించి చెప్పుకొచ్చారు.నేడు సాయంత్రం 4 గంటలకు కల్కి జర్నీకు సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
A journey into the world of #Kalki2898AD ft. Director @nagashwin7…
Catch Episode 1 – Today at 4 PM!#Kalki2898ADonJune27 pic.twitter.com/OwkAVaeLmR
— Kalki 2898 AD (@Kalki2898AD) June 18, 2024