తమిళనాడులోని పల్లడం దగ్గరప్రధాని మోడీని జర్మనీ సింగర్ కసాండ్రా మే స్పిట్ మాన్ సమావేశం అయ్యారు. ఆమె 'అచ్యుతమ్ కేశవమ్' భక్తి గీతాన్ని ఆలపిస్తుండగా.. దానికి మోడీ తన చేతులతో దరువేస్తూ ఆమె పాటను ఆస్వాదించారు.
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.. భారతదేశం మొత్తం ఆ శ్రీరాముడి నామంతో మునిగిపోయింది. ఒక జర్మన్ గాయకురాలు రాముడికి సంబందించి అందమైన పాటను తనదైన శైలిలో పాడింది.