MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Thomas: జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో థామస్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నారాయణస్వామి ఎంపీపీ సీటు అమ్ముకుని తిరుపతిలో కోటిన్నర విల్లా కొన్నాడని ఓపెన్ గా ఎటాక్ చేశారు. నారాయణస్వామి నన్ను గెలకవద్దు.. నన్ను గెలికితే నీకు రాత్రి పూట నిద్ర కూడా పట్టదు.. ఏ అర్ధరాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్” అంటూ థామస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జీడీ నెల్లూరులో పాదయాత్ర చేసిన నారా లోకేష్ పై అక్రమంగా కేసులు పెట్టించావని, లోకేష్ పై కేసు పెట్టేంత మగాడివా నువ్వు… నేను అనుకుంటే ఈ రాత్రికే కట్ డ్రాయర్ తో పోలీస్ స్టేషన్ లో నిన్ను కూర్చోబెట్టగలను… చంద్రబాబుకు ఇలాంటి పనులు నచ్చవు కాబట్టే తాము పద్ధతిగా పోతున్నామన్నారు.
ఇక, నారాయణస్వామికి మతిస్థిమితం లేదని బయట ఎక్కడా మంచి హాస్పిటల్ దొరకనట్లు ఉందని, ఒకవేళ తన హాస్పిటల్ కి వస్తే మూడు సార్లు కరెంట్ షాక్ ఇస్తే అంతా సెట్ అవుతాయాన్నారు థామస్.. తాను చదువుకున్న వాడిని కాబట్టే ఎంతో బాధ్యతగా మాట్లాడుతున్నానని, నారాయణస్వామి కంటే దారుణంగా బూతులు మాట్లాడగలనని చెప్పారు. తాను గనుక నోరు తెరిచి మాట్లాడితే ముక్కు, చెవుల నుంచి రక్తం వస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును ఎంత అసభ్య పదజాలంతో దూషించావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని నేను ఒక్క పిలుపు ఇస్తే నారాయణస్వామి ఇల్లు దాటి బయటకు కూడా రాలేడంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే థామస్..
Also Read
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!