Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Gayathri Gupta Says Iam The Heroine In Baby Movie

Gayathri Gupta-Baby: బేబీ సినిమాలో నేనే హీరోయిన్.. గాయత్రి గుప్తా సంచలన కామెంట్స్!

Published Date :May 30, 2024 , 2:36 pm
By Sampath Kumar
Gayathri Gupta-Baby: బేబీ సినిమాలో నేనే హీరోయిన్.. గాయత్రి గుప్తా సంచలన కామెంట్స్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Gayathri Gupta Controversial Comments on Baby Movie: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బేబీ’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్యకు స్టార్ డమ్ వచ్చింది. బేబీ అనంతరం వైష్ణవి కెరీర్ పూర్తిగా మారిపోయింది. వరుస అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి. అయితే బేబీ సినిమాలో తాను హీరోయిన్‌గా నటించాల్సిందని గాయత్రి గుప్తా తెలిపారు.

గాయత్రి గుప్తా వ్యాఖ్యలతో బేబీ వివాదం మరింత ముదురుతున్నట్లు కనుబడుతోంది. బేబి సినిమా కథ తనదేనని, సాయి రాజేష్ తన దగ్గరి నుంచి కాపీ కొట్టాడని ‘ప్రేమించొద్దు’ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు. సాయి రాజేష్ మోసాన్ని ‘బేబీ లీక్స్’ అనే బుక్ ద్వారా ఆయన బయటపెట్టారు. బుక్‌కు సంబంధించిన లింక్‌ను https://babyleaks2023.blogspot.com/ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో షేర్ చేశారు. ఈ రచ్చ కొనసాగుతుండగానే.. గాయత్రి గుప్తా మరో బాంబ్ పేల్చారు. బేబీ సినిమాలో ముందుగా తననే హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారని, డైరెక్టర్ సాయి రాజేష్ తనను మోసం చేశాడని ఆధారాలతో సహా గాయత్రి బయటపెట్టారు.

Also Read

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
  • Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
  • Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
Add as a preferred
source on google

‘నేను, శిరిన్ శ్రీరామ్ మంచి స్నేహితులం. 15 ఏళ్లుగా అతడు నాకు తెలుసు. నాకు విడాకులు అయ్యాక నాతో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. నా కెరీర్‌కు అది చాలా హెల్ప్ అయింది. బేబీ సినిమా స్టోరీని ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్‌తో శిరిన్ రాసుకున్నాడు. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్‌గా శిరిన్ నన్ను అనుకున్నాడు. స్కూల్ డ్రెస్సులో నన్ను ఆడిషన్ కూడా చేశాడు. ఆ ఫొటోలను సాయి రాజేష్‌కు నేను చూపించాను. దానినే అతడు బేబీలో కాపీ కొట్టాడు. హృదయ కాలేయం ఆడియో లాంచ్‌కు నేను వెళితే.. సాయి రాజేష్‌ నన్ను చూశాడు. శిరిన్ దగ్గర నంబర్ తీసుకుని నాకు కాల్ చేశాడు. కొబ్బరిమట్ట సినిమా చేస్తున్నా.. అందులో నువ్వే హీరోయిన్‌ అని చెప్పాడు. అలా సాయి రాజేష్‌ నాకు పరిచయం’ అని గాయత్రి గుప్తా చెప్పారు.

Also Read: Virat Kohli: నిజం చెబుతున్నా.. ఆ రోజు చాలా భయపడ్డా: కోహ్లీ

‘సినిమా ఇండస్ట్రీలో నేను 20-30 సినిమాలు చేశా. కానీ కొబ్బరిమట్ట సినిమాతో చాలా కష్టాలను ఎదుర్కొన్నా. 4-5 ఏళ్లు షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు సాయి రాజేష్‌ రూ. 3 లక్షల పారితోషికం ఇస్తానన్నాడు. కానీ కేవలం రూ. 25 వేలు ఇచ్చాడు. ఈ స్టోరీ మీద రవి కిరణ్ అని కూడా పని చేశాడు. కొత్త అమ్మాయిని పెట్టుకుంటా అని శిరిన్ అనడంతో నేను ఓకే అన్నా. బేబి కథను మొదట రాసుకుంది శిరిన్. సాయి రాజేష్ ఆ స్టోరీని తానే క్రియేట్ చేశానంటాడు. ఇద్దరు (సాయి రాజేష్, శిరిన్) కలిసి ఆ కథతో మూవీ చేద్దామని.. చివరి క్షణంలో బడ్జెట్ లేదని శిరిన్‌ను తప్పించాడు. 2015 నుంచి ఆ కథను శిరిన్ రాసుకున్నాడు. ఆ కథను గీతా ఆర్ట్స్‌తో చర్చలు జరిపాడు. పాము లాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించలేదు. బేబీ మూవీ కోసం సాయి రాజేష్ చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేశాడు. సాయి రాజేష్ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు ఓ మచ్చ. బేబి స్టోరీ రాసుకున్న శిరిన్‌కు న్యాయం జరగాలి’ అని గాయత్రి గుప్తా ఫైర్ అయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • baby
  • Baby Movie Controversy
  • Gayathri Gupta
  • Gayathri Gupta Baby
  • Gayathri Gupta on Baby Movie

తాజావార్తలు

  • Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

  • Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్‌లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!

  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions