భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ సెంట్రల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని చెప్పారు. 2005-06 సీజన్ తర్వాత టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అంతేకాకుండా.. ఆసియా కప్ 2023 లేదా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఈవెంట్లలో పాకిస్తాన్‌లో ఆడటానికి భారత్ అక్కడికి వెళ్లలేదు. కాగా.. పాకిస్తాన్ చివరిసారిగా 2012-13 సీజన్‌లో ఇండియాలో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. 2023లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్ ఇండియాకు వచ్చింది.
Read Also: Etela Rajender : గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది
కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పాకిస్తాన్‌కు వెళ్లడానికి నిరాకరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ, పీసీబీ మధ్య ICC ఒప్పందం కుదుర్చింది. ఈ సందర్భంలో.. గవాస్కర్ మాట్లాడుతూ సరిహద్దులో శాంతి నెలకొల్పగానే క్రికెట్ పరంగా రెండు దేశాలు తిరిగి పరస్పర పోటీలు నిర్వహించవచ్చని అన్నారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడం ద్వారా.. ఇండియా, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ ఆడటం చాలా సులభం. సరిహద్దుల్లో శాంతి ఉండేలా.. రెండు ప్రభుత్వాలు చూడాలన్నారు.
Read Also: Retro: సితార చేతికి సూర్య నటించిన ‘రెట్రో’ పగ్గాలు..
