Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోవడంతో ఆయనకు వరుసగా వీడ్కోలు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అగార్కర్‌ను ఉద్దేశించి చాలా భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. “చరిత్ర నీ పట్ల చాలా మృదువుగా, దయతో వ్యవహరిస్తుంది” అంటూ ఒక్క మాటతో అగార్కర్ చేసిన సేవలకు తిరుగులేని లెక్క చెప్పారు గంభీర్. అగార్కర్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు గంభీర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అగార్కర్ హయాంలో భారత్ సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీలే ఆయన నిర్ణయాలకు, పనితనానికి నిదర్శనమని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఎప్పుడూ ‘జట్టే ముఖ్యం, జట్టు ప్రయోజనాలే ప్రథమం’ అనే అగార్కర్ నమ్మకానికి ఈ విజయాలే సాక్ష్యమని కొనియాడారు. “డియర్ అజిత్ భాయ్.. మీతో కలిసి పనిచేయడం నాకొక గొప్ప అనుభవం. ప్రతీ విషయంలోనూ మీకు నా ధన్యవాదాలు. మీ భవిష్యత్తు ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ గంభీర్ తన సందేశాన్ని ముగించారు.
నిజానికి ఇది ఏదో సాధారణంగా చెప్పిన వీడ్కోలు మాటలా అనిపించడం లేదు. గౌతీ అన్న ఆ ఒక్క మాట వెనుక చాలా పెద్ద కథే ఉంది. అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో జట్టు ఎంపికపై ఎన్నో వివాదాలు నడిచాయి, పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. కొందరు సీనియర్లను పక్కన పెట్టడం, కొత్తవారికి అవకాశాలివ్వడంపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. అయితే కాలం గడిచేకొద్దీ ఆ నిర్ణయాల వెనుకున్న అసలు నిజాలు, వాటి ఫలితాలు బయటపడతాయని గంభీర్ అభిప్రాయపడ్డారు. ఆ రిజల్ట్స్ చూస్తే మాత్రం ఇండియా గెలిచిన మూడు ఐసీసీ ట్రోఫీలే ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఇక్కడ గంభీర్ కేవలం థ్యాంక్స్ చెప్పి ఊరుకోకుండా, అగార్కర్ తీసుకున్న కఠిన నిర్ణయాలను కూడా బహిరంగంగా సమర్థించారు. సెలెక్టర్ పని అందరినీ మెప్పించే నిర్ణయాలు తీసుకోవడం కాదు, జట్టుకు ఏది మంచిదో అదే చేయడం. ఒక్కోసారి అభిమానులకు నచ్చని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా అగార్కర్ ఏమాత్రం వెనకడుగు వేయలేదని, ఎప్పుడూ ప్లేయర్ల కంటే టీమ్ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని గంభీర్ గుర్తుచేశారు. ఇక, మైదానంలో గంభీర్, సెలెక్టర్ సీటులో అగార్కర్.. ఇద్దరిదీ ఒకే రకమైన అగ్రెసివ్ ఆలోచనా విధానం. టీమిండియా క్రికెట్లో వీరిద్దరి కాంబినేషన్ ఒక ప్రత్యేకమైన శకానికి వేదికైంది. ఇప్పుడు అగార్కర్ వైదొలగడంతో ఆ జోడీ అధ్యాయానికి తెరపడింది. సాధారణంగా సెలెక్టర్లు తీసుకునే కొన్ని నిర్ణయాల ఫలితాలు వెంటనే తెలిస్తే, మరికొన్నింటి విలువ చాలా కాలం తర్వాత అర్థమవుతుంది. అగార్కర్ విషయంలో కూడా కాలమే సరైన తీర్పు ఇస్తుందని, ఆ తీర్పు వచ్చినప్పుడు ఖాతాలో ఉన్న మూడు ఐసీసీ ట్రోఫీల కంటే పెద్ద సాక్ష్యం మరొకటి ఉండదని గంభీర్ పోస్ట్ స్పష్టం చేస్తోంది.
Also Read
- AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
- Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!