కుక్క మాంసం ఎగుమతులు, విక్రయాలపై నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు కొట్టేసింది. వాణిజ్య అవసరాల కోసం కుక్కల దిగుమతి, వాటితో వర్తకం, రెస్టారెంట్లలో వాణిజ్య ప్రాతిపదిక, వాటి మాంసం విక్రయాలను నిషేధిస్తూ నాగాలాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిషేధ ఉత్తర్వులు జారీ చేయడానికి చీఫ్ సెక్రటరీ తగిన వ్యక్తి కాదని గౌహతి కోర్టు తెలిపింది.