Ganja Smuggling : ప్యాకర్స్ అండ్ మూవర్స్ పేరిట ఇంటి సామాన్లను తరలిస్తున్నట్లు బిల్డ్ అప్ ఇచ్చి, వాస్తవానికి భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం నాడు ఓ ఆర్ ఆర్ వద్ద ఈ స్మగ్లింగ్ బస్తీ బట్టబయలైంది. ఈ ఘటన వివరాలను సైబరాబాద్ డీసీపీ కోటిరెడ్డి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, బోయిన్‌పల్లికి చెందిన ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి తనకు ఉన్న బొలెరో వాహనాన్ని ప్యాకర్స్ అండ్ మూవర్స్ పనులకు ఉపయోగిస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన సన్నీ అనే వ్యక్తి డ్రైవర్‌గా, మనీష్ కుమార్ హెల్పర్‌గా చేరారు.
మార్చి 31న ప్రదీప్ కుమార్, హర్యానాకు చెందిన సాహిల్తో కలిసి ఒడిషా వెళ్లి, అక్కడ సుభాష్ అనే వ్యక్తి నుండి 273 కిలోల గంజాయిను ₹1.30 లక్షలకే కొనుగోలు చేశారు. తర్వాత ఆ గంజాయిని హర్యానాకు తరలించాలన్న ప్లాన్‌తో తెలంగాణ మీదుగా ప్రయాణం మొదలెట్టారు.
ఈ సమాచారం పక్కాగా తెలిసిన ఎస్‌ఓటీ (Special Operations Team), షామీర్పేట్ పోలీసులు కలిసి ఓఆర్‌ఆర్ వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అందులో గంజాయి దాచినట్టుగా బయటపడింది. ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంట్లో కాలి సామాన్లను తరలిస్తున్నట్లు నటిస్తూ, వాస్తవంగా ఒడిషా నుంచి హర్యానాకు గంజాయి తరలించడానికి ఈ ముఠా పక్కా ప్రణాళిక వేసింది. దీనికోసం బొలెరో వాహనం, మొబైల్ ఫోన్లు, జియో డాంగిల్ వంటివన్నీ సీజ్ చేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు రూ. కోటి వరకు ఉంటుందని డీసీపీ తెలిపారు. డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ, “అక్రమ గంజాయి రవాణాపై పౌరులు అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 9490617444 ద్వారా తెలియజేయండి” అని కోరారు.
Sreeleela : దారుణం.. శ్రీలీలను అక్కడ పట్టుకుని లాగిన ఆకతాయిలు..