Site icon NTV Telugu

Ganja Gang Attack: మితిమీరిన గంజాయి బ్యాచ్ ఆగడాలు.. ఆసుపత్రి రిసెప్షనిస్ట్‌పై కత్తితో దాడి..!

Crime

Crime

Ganja Gang Attack: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు చోటుచేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆరుగురు యువకులు హాస్పిటల్ ముందు మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టించారు. హాస్పిటల్ ముందు మద్యం సేవించవద్దని హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించడంతో, ఆ యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు.

Bindi Benefits: సిగ్గుతో మగవారు, ఫ్యాషన్ పేరుతో ఆడవారు.. బొట్టు పెట్టుకోవడం మానేసారుగా..! బొట్టు విలువ తెలుసా..?

ఈ దాడిలో హాస్పిటల్ రిసెప్షనిస్ట్ విద్యాసాగర్‌పై యువకులు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం ఆరుగురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. గంజాయి బ్యాచ్‌గా భావిస్తున్న ఈ యువకుల ఆగడాలు.. హాస్పిటల్ ముందు సిబ్బందిపైనే దాడికి పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

katrina kaif-vicky : బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్..హ్యాపీ న్యూస్‌తో సోషల్‌ మీడియాలో హడావిడి!

Exit mobile version