Site icon NTV Telugu

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో.. ల్యాప్‌టాప్‌ చోరి కేసును ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు

Cyberabad

Cyberabad

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాప్‌టాప్‌ చోరి కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. గచ్చిబౌలి పోలిసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. వారం రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సి.వి రావు ఇనిస్టిట్యూట్ లో ల్యాప్‌టాప్‌లు చోరికి గురయ్యాయి. ఈ చోరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు సమాచారం. దొంగిలించిన ల్యాప్‌టాప్‌ లను నిందితులు బెంగళూరుకి తరలించారు. యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్ లతో తన ఫోన్లో పోలీసుల కదలికలను గమనించిన స్టూడెంట్స్.. కారును గుర్తుపట్టకుండా నెంబర్ ప్లేట్ చేంజ్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు స్టూడెంట్స్.. నిందితులవద్ద నుండి 55 లాప్ టాప్ లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

Exit mobile version