Bhatti Vikramarka : ప్రపంచం మొత్తం థర్మల్ పవర్ నుండి గ్రీన్ పవర్ వైపుగా అడుగులు వేస్తోంది
- భద్రాద్రి కొత్తగూడెంలో 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రులు
- పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. తుమ్మల.. పొంగులేటి
- ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విజయదశమి ఇది
- రాష్ట్ర ప్రజలు విజయాలు పొందే విధంగా ప్రభుత్వం తరపున అండ గా ఉంటామని హామీ ఇస్తున్నాం : భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విజయదశమి ఇది అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు విజయాలు పొందే విధంగా ప్రభుత్వం తరపున అండ గా ఉంటామని హామీ ఇస్తున్నామని, దసరా బహుమతిగా పామాయిల్ కర్మాగారం లో పవర్ ప్లాంట్ ప్రారంభించడం ఆనంద దాయకమన్నారు భట్టి విక్రమార్క. ప్రపంచం మొత్తం థర్మల్ పవర్ నుండి గ్రీన్ పవర్ వైపుగా అడుగులు వేస్తోందని, రాబోయే ఐదేళ్ళల్లో తెలంగాణా లో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు 1990 లో పామాయిల్ సాగు కోసం ఆలోచన చేశారని, మలేషియాకు ఇక్కడి బృందాలను పంపి పామాయిల్ తీసుకువచ్చే ఏర్పాట్లకు పునాది నాడే పడిందన్నారు భట్టి విక్రమార్క.
Harihara Veeramallu: హరిహర వీరమల్లు కోసం పాట పాడిన పవన్
Also Read
దిగుమతి కి కస్టమ్స్ డ్యూటీ 28 % పెంచి మన పామాయిల్ కు మద్దతు ధర దిశగా చర్యలు తీసుకున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 73 వేల కోట్లు కేటాయించామన్నారు. రెండు లక్షల రుణ మాఫీ 18 వేల కోట్లు 15 రోజుల్లోనే వేసి చరిత్ర సృష్టించామని, గత బీఆర్ఎస్ పాలకులు అరకొర ఋణమాఫీలు చేసి చేతులు దులుపున్నారన్నారు. అంతేకాకుండా..’ఇప్పుడొచ్చి తగుదునమ్మా అని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ వెసులుబాటు వున్నా మిగిలిన రైతులకు కూడా మాఫీ చేస్తాం. భవిష్యత్ లో రైతులకు పంట భీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. రైతు గౌరవంగా నిలబడే ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పైలట్ ప్రాజెక్టు లు తీసుకుని పొలాల్లో సోలార్ పంప్ సెట్ లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ నిధులతో ఇళ్లపై కూడా సోలార్ పెట్టుకునేలా ఆలోచన చేస్తున్నాం. అశ్వారావుపేట ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ గా రెండు గ్రామాలను తీసుకుని సోలార్ ప్రాజెక్టు ప్రారంభిస్తాం. రైతులకు రుణమాఫీ లో సాంకేతిక కారణాలు ఏవున్నా సరిచేసి మాఫీ చేస్తాం’ అని భట్టి విక్రమార్క అన్నారు.
CM Chandrababu: గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!