GATE 2025: గేట్ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడగింపు..
- గేట్ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడగింపు..
- 3 అక్టోబర్ 2024 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు.
- అంతకుముందు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 26 సెప్టెంబర్ 2024.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GATE 2025: గేట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడిగించబడింది. దింతో ఇప్పుడు విద్యార్థులు 3 అక్టోబర్ 2024 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకుముందు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 26 సెప్టెంబర్ 2024 గా ఉండేది. ఇప్పుడు అది అక్టోబర్ 3 వరకు పొడిగించబడింది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు ఈ అవకాశం ఎంతో మేలు చేకూరనుంది. గేట్ 2025 కోసం దరఖాస్తు చేయడానికి , విద్యార్థులు ముందుగా gate2025.iitr.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి . హోమ్ పేజీలో ‘రిజిస్ట్రేషన్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి . దీని తర్వాత, పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడిని నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. దీని తర్వాత ఫారమ్‌ను పూరించండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఆపై దరఖాస్తు రుసుమును చెల్లించండి.
Devara: దేవర గ్రాండ్ సక్సెస్ మీట్… ఎప్పుడంటే..?
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
గేట్ 2025 కోసం దరఖాస్తు రుసుము షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) , షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ), వికలాంగ కేటగిరీ విద్యార్థులు రూ. 900 ఫీజు చెల్లించాలి. ఇక మిగితా విద్యార్థులకి, విదేశీ పౌరులకు రిజిస్ట్రేషన్ ఫీజు 1800 రూపాయలు. ఆలస్య రుసుముతో అయితే జనరల్, OBC కేటగిరీ విద్యార్థులు రూ. 2300, SC/ST/PWD దరఖాస్తుదారులు రూ. 1400 చెల్లించాలి. గేట్ 2025 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ 2 జనవరి 2025న విడుదల చేయబడుతుంది. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి ఈ కార్డును డౌన్‌లోడ్ చేసుకోగలరు. పరీక్ష 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించబడుతుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి షిప్టు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. ఆపై గేట్ 2025 పరీక్ష ఫలితాలు 19 మార్చి 2025న ప్రకటించబడతాయి.
Ireland vs South Africa: సెంచరీ చేసిన మాజీ రబ్బీ ప్లేయర్.. ఐర్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు!
ఇంజినీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ఈ ఫలితాలు ముఖ్యమైనవి. గేట్ పరీక్ష ఆధారంగా.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సంయుక్తంగా నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష. ఈ పరీక్ష ప్రధానంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం. కానీ, ఇది ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..