టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం సభపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జులై 2 న ఖమ్మంలో సభ పెట్టాలని అధిష్టానం ఆదేశించిందని తెలిపారు. అందుకోసం సభ ఏర్పాట్ల పరిశీలనకై ఖమ్మం వచ్చానని రేవంత్ పేర్కొన్నారు. ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పకడ్బందీగా చేస్తున్నారని ఆయన వెల్లడించారు. భారీ ఎత్తున సభ కోసం పొంగులేటి ఆర్టీసీ బస్సులు అడిగారన్నారు. ఆర్టీసీ అధికారులు ముందు బస్సులు ఇస్తామని, ఇప్పుడు బస్సులు ఇవ్వలేమని చెబుతున్నారని రేవంత్…