France Political Crisis 2025: ప్రజా క్షేత్రంలో ఎన్నికైన ప్రభుత్వానికి ఏ దేశంలోనైనా ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. ఈ ఐదేళ్ల కాలంలో పాలకులు మహా అంటే ఒక్కరూ లేదా ఇద్దరు మాత్రమే మారుతారు. చాలా సందర్భాల్లో మారరు కూడా. కానీ ఫ్రాన్స్‌లో వింత పరిస్థితి నెలకొంది. ఈ దేశంలో ఏకంగా ఏడాది కాలంలో నాలుగురు ప్రధాన మంత్రులు మారారు. తాజాగా 27 రోజుల క్రితం ప్రధానమంత్రిగా నియమితులైన లెకోర్ను ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజారిటీ లేకపోవడంతో ఆయన తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయన తన రాజీనామా నాలుగు గంటల ముందు మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ పరిణామాల కారణంగా ఫ్రాన్స్‌లో ఏం జరుగుతుందనేది ప్రపంచం నిశితంగా గమనిస్తుంది.
READ ALSO: YS Jagan: ఉద్యోగులకు కూటమి ప్రభుత్వ మోసంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్..
ఫ్రాన్స్‌లో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.. ప్రధానిని కాదు..
ఫ్రాన్స్‌లో ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా దేశ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అధ్యక్షుడి పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఒక వ్యక్తి రెండు పర్యాయాలు మాత్రమే పదవిలో కొనసాగగలరు. దేశంలో ప్రధానమంత్రి నియామకంలో ప్రజలకు ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. ప్రధానమంత్రిని ఎన్నుకునే అధికారం అధ్యక్షుడికి ఉంది. అయితే ఎన్నికైన ప్రధానమంత్రి ప్రతినిధుల సభ విశ్వాసాన్ని పొందాలి. ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 577 సీట్లు ఉన్నాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశంలో ఎన్నికలు జరుగుతాయి. జాతీయ అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా మారితే, ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వస్తుంది. అందుకే ఫ్రాన్స్ సభలో మెజారిటీ ఉన్న పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో మెజారిటీకి 279 సీట్లు అవసరం. చాలా మంది నాయకులు తరచుగా సంకీర్ణాల ద్వారా ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రులు అయ్యారు.
సమస్య ఎక్కడ వచ్చింది..
దేశంలో 2017లో తొలిసారి ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2022లో ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చారు. 2024లో ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు, పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. 2024 తర్వాత సభలో మెజారిటీ లేని నాయకులకు ప్రధానమంత్రి పదవిని ఇచ్చారని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో గత ఏడాది కాలంలో ఫ్రాన్స్‌లో నలుగురు ప్రధానులు మారారు.
ఫ్రాన్స్‌లో ఇప్పుడు ఏం జరగబోతుంది..
దేశంలో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై రాజకీయ ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన 2027 వరకు అధ్యక్ష పదవిలో ఉంటారు. ప్రస్తుతం మాక్రాన్ ముందు ఒకటే దారి ఉందని, ప్రధాన మంత్రి పదవిని సభలో అతిపెద్ద పార్టీ, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ది ర్యాలీ గ్రూప్ నాయకుడికి అప్పగించాల్సి రావచ్చని చెబుతున్నారు. ర్యాలీ గ్రూప్ సంకీర్ణానికి 300 మందికి పైగా ఎంపీల మద్దతు ఉంది. ఇదే జరిగితే మాక్రాన్‌కు పెద్ద రాజకీయ దెబ్బగా మారుతుందని అంటున్నారు. ఇదే సమయంలో ర్యాలీ గ్రూప్ పార్లమెంటును రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.
READ ALSO: Indian Nobel Laureates: ఇప్పటి వరకు భారత్‌కు ఎన్ని నోబెల్ బహుమతులు వచ్చాయో తెలుసా!