పంట పండించడం ఒకేతైతే దానిని కాపాడుకోవడం రైతులకు పెద్ద సమస్యల మారింది. ఏదైనా కొంచెం గిట్టుబాటు ధర ఎక్కువ ఉన్న పంటను పండిస్తే చాలు దానిని దొంగలు దోచుకెళ్తుతున్నారు. దీని కారణంగా పడిన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. మొన్నటి వరకు టమాటా కొండెక్కి కూర్చోవడంతో రైతులు దానిని కాపాడేందుకు గన్ లతో పాహారా కాసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పహిల్వాన్లను పెట్టి గస్తీ కూడా కాయించారు. అయినా చాలా చోట్ల టమాటాల దొంగతనాలు జరిగాయి. ప్రస్తుతం టమాటాల ధరలు దిగి వస్తున్నాయి. ఇది సామాన్యులకు ఊరట కలిగించే విషయమే. అయితే టమాటా దిగి వస్తుంటే ఉల్లి, అరటి, యాపిల్, దానిమ్మ వంటి ధరలు పెరుగుతున్నాయి.
Also Read: Man cuts off Finger: ప్రధాని మోడీకి ఓటు వేసిన వేలును నరుకున్న వ్యక్తి.. కారణమేంటంటే?
దానిమ్మ ధరలు ఎక్కువగా ఉండటంతో గన్ తో తోటకు కాపలా కాస్తున్నారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా కేంద్రం పరిధిలోని నాయనహళ్లి, అందార్లహళ్లి, నంది, చదలపుర తదితర గ్రామాలలో దానిమ్మ తోటలకు రైతులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. దొంగల బెడద ఎక్కువగా ఉండటంతోనే రైతులు ఇలా చేస్తున్నారు. తరచూ తోటల్లోకి దొంగలు చొరబడి పండ్లను ఎత్తుకెళ్తున్న ఘటనలు ఆ ప్రాంతంలో ఎక్కువవుతున్నాయి. దీంతో రైతులు రాత్రి వేళలో కాపలా కాస్తున్నారు. నాయనహల్లి గ్రామంలో చందన్ అనే రైతు రెండు ఎకరాలలో రూ. 5 లక్షల ఖర్చుపెట్టి దానిమ్మ పంటను వేశాడు. వారం కిందట ఈయన తోటలో దొంగలు పడి సుమారు టన్ను బరువైన దానిమ్మ పండ్లను దొంగిలించుకొనిపోయారు. పక్కనే ఉన్న దేవరాజ్ అనే రైతు తోటలోనూ ఇంతేమొత్తంలో దానిమ్మను ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం మార్కెట్ లో మేలిరకం దానిమ్మ కేజీ ధర రూ.150 నుంచి 200 దాకా పలుకుతుంది. దీంతో చదలపురంలో మునిరాజు అనే రైతు తమ చుట్టాలను ఇంటికి పిలిపించుకొని రాత్రి వేళలో తుపాకీ, కారంపొడి పట్టుకొని గస్తీ కాస్తున్నారు. తుపాకీకి లైసెన్స్ ఉందని మునిరాజు తెలిపారు. ఈ విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. మునిరాజు ఆరు ఎకరాలలో దానిమ్మ సాగు చేస్తున్నారు. ఒకవేళ దొంగలు కానీ దొంగతనానికి వచ్చి వారి చేతికి చిక్కితే వాళ్లపని అయిపోయినట్టే అంటున్నారు. మరి చూడాలి ఎంతకాలం ఇలా చేస్తూ దొంగల నుంచి కాపాడుకుంటారో.