ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై నిన్న (శుక్రవారం) రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ కారు, పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో అక్కడిక్కడే నలుగురు మరణించారు. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ముగ్గురు ప్రయాణికులు ఉన్న కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి మృతి చెందారు.
Read Also: Yadadri: ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి.. ఆమెకు ఇంతకు ముందే పెళ్లైదా..!
అయితే, కారులో వాహనంలో సీఎన్‌జీ సిలిండర్లు ఉండడంతో మంటలు చెలరేగాయని బిలాస్‌పూర్ పోలీసు అధికారి వినోద్ కుమార్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ప్రయాణికులు జైపూర్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక, కారును ఢీకొట్టిన తర్వాత ఆయిల్ ట్యాంకర్ హైవేపై పికప్ వ్యాన్‌ను సైతం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.
Read Also: Grama Sachivalayam Locked: అద్దె చెల్లించలేదు.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన యజమాని..
ఇక, ప్రమాదం జరిగిన తర్వాత ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటన గురించి తమకు సమాచారం రాగానే సంఘటన స్థలానికి చేరుకోగానే కారు మంటల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారని చెప్పారు. అలాగే పికప్ వ్యాప్ డ్రైవర్ సైతం ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడం వల్ల మరణించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.