పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో గంజాయిని తరలిస్తున్న ముఠాను కొమురం భీం జిల్లా వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దు దాటే క్రమంలో పోలీసులు చాకచక్యంగా దొరకబట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా జిల్లా ఎస్పీకి సమాచారం వచ్చింది. దీంతో.. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ట్యాంకర్‌లో ఉన్న సుమారు 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
బీహార్‌లో మద్యంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో కల్తీ మద్యం దందా, అక్రమ మద్యం రవాణా పెరుగుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 37 మంది మృతి చెందారు. ఈ కేసులో మొత్తం ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు.
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ హైవేపై నదియాడ్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉనాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన తర్వాత.. ఆయిల్ కిందకు కారి మంటలు వ్యాపించాయి. దీంతో పలు వాహనాలు, దుకాణాలు కూడా దగ్ధమయ్యాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. హరోలి ప్రాంతంలోని తహ్లివాలా కస్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కాగా.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు.
ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై నిన్న (శుక్రవారం) రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ కారు, పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో అక్కడిక్కడే నలుగురు మరణించారు.