టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీకి అభ్యర్థులు దొరకవడం లేదని విమర్శించారు. పెనమలూరు నియోజకవర్గానికి గ్రహణం పట్టుకుందని ఆరోపించారు. ఒక సంస్కారహీనుడిని వైసీపీ పెనమలూరు నియోజకవర్గానికి పంపించిందని మండిపడ్డారు.
YCP Rebel MLA: నూజివీడు టీడీపీలో పార్థసారధి రచ్చ..
ఎన్ని కారుకూతలు కూసినా.. పెనమలూరు నియోజకవర్గంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ పార్టీలో ఛీ కొడితే, తమ పార్టీలో కూడా ఛీ కొడతారని పేర్కొన్నారు. సీఎం జగన్ అమరావతిని భ్రష్టుపట్టించాడని ఆరోపించారు. పేదవారికి 5 రూపాయలకే అన్నం పెట్టే పథకాన్ని చంద్రబాబు పెడితే.. దానిని ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మీరేం చేశారని నమ్మాలి అని సీఎం జగన్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంటు బిల్లులు పెంచారని నమ్మలా.. ఉచిత ఇసుక విధానం రద్దు చేసినందుకా.. 5 సంవత్సరాలు పోలవరం నిర్మాణం పూర్తి చేయనందుకా నమ్మాలా అని అన్నారు. రాష్ట్రంలో మధ్య నిషేదం చేస్తానని చెప్పి.. మళ్లీ ఓట్లు అడుగడానికి వచ్చినందుకా నమ్మలా అని దుయ్యబట్టారు.
Kumari Aunty: దేవుడా.. నెలకు రూ. 18 లక్షలా.. కుమారి ఆంటీ.. సాప్ట్ వేర్ లో కూడా ఇంత రాదే..
చంద్రబాబు నాయుడు ప్రపంచలో ఉన్న తెలుగువారందరూ మెచ్చిన నాయకుడని అన్నారు. ఒక మహా నగరాన్ని అభివృద్ధి జరగడంలో.. ఒక స్ఫూర్తి చంద్రబాబుదని బోడే ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన కలిసి ప్రచారంలోకి దిగితే వందలాది మంది మద్ధతు తెలుపుతున్నారని అన్నారు. దాన్ని తట్టుకోలేకనే మైండ్ చెడిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వైసీపీపై మండిపడ్డారు.