పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్.. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో నోరుజారాడు. అతను తన పరిమితులను మరిచిపోయి బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యారాయ్ గురించి చెడుగా మాట్లాడాడు. జట్టు సభ్యుల్లోనూ, బోర్డులోనూ సంకల్పమే సరిగా లేదని చెబుతూ... ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ అసందర్భ ప్రేలాపనలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై భారత్ లోనే కాదు, పాకిస్థాన్ లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.
టీమిండియా ఓడిపోతామనే భయంతోనే పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు ఇష్టపడడం లేదని పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. ‘ఇండియా- పాకిస్తాన్ జట్ల మధ్య మంచి గౌరవం, స్నేహం గతంలో ఉండేవి.. కానీ ఇప్పుడున్న టీముల్లో భారత జట్టు ఒక్కటే, పాకిస్తాన్‌తో సిరీస్‌లు ఆడడం లేదు.. వాళ్లు ఎందుకు ఆడడం లేదో తెలుసా.. పాక్ జట్టు పటిష్టంగా ఉంది.. ఒకవేళ ఆడితే ఓడిపోతామనే భయంతోనే మ్యాచ్ లు ఆడటం లేదని రజాక్ చెప్పాడు.