NTV Telugu Site icon

Saeed Ahmed: పాక్ మాజీ కెప్టెన్ కన్నుమూత..

Pak Crickter

Pak Crickter

అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ స‌యీద్ అహ్మద్ (86) క‌న్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ త‌ర‌ఫున 41 టెస్టులు ఆడారు. అందులో 5 సెంచ‌రీలు, 16 అర్ధ శ‌త‌కాలతో 2991 ప‌రుగులు చేశారు. అంతేకాకుండా.. అహ్మద్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ కాగా.. 22 వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే.. అహ్మద్ చేసిన 5 శ‌త‌కాల‌లో మూడు ఇండియాపైనే న‌మోదు చేశారు.

IPL: ముగిసిన ఒక శకం.. వీరి కెప్టెన్సీ ఇక చూడలేమా..!

1958లో వెస్టిండీస్‌తో జరిగిన బ్రిడ్జ్‌టౌన్‌ టెస్ట్‌లో అహ్మద్‌ అరంగేట్రం చేశాడు. 1972-73లో మెల్‌బోర్న్ వేదిక‌గా త‌న చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడారు. అహ్మద్ పాకిస్థాన్‌కు ఆరో టెస్టు కెప్టెన్‌. పాక్ దిగ్గజం హ‌నీఫ్ మ‌హ్మద్ త‌ర్వాత కెప్టె్న్సీ బాధ్యతలు 1969లో అహ్మద్ కే ద‌క్కాయి. . తన స్వల్ప కెరీర్‌లో మూడు మ్యాచ్‌ల్లో పాక్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Manchu Manoj: పవన్ కే ఓటు వేయండి.. నేను అలా అనలేదు

ఫిట్‌నెస్‌ విషయంలో క్రికెట్‌ బోర్డుకు తప్పుడు సమాచారం అందించాడన్న కారణంగా అతని కెరీర్‌కు అర్దంతంగా ఎండ్‌ కార్డ్‌ పడింది. పాక్‌ దిగ్గజం హనీఫ్‌ ముహమ్మద్‌ విండీస్‌పై చారిత్రక ట్రిపుల్‌ సెంచరీ (337) సాధించిన ఇన్నింగ్స్‌లో అహ్మద్‌ అతని భాగస్వామిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. సయీద్‌ అహ్మద్‌ సోదరుడు యూనుస్‌ అహ్మద్‌ కూడా పాక్‌ టెస్ట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. యూనుస్‌ పాక్‌ తరఫున నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. కాగా.. అహ్మద్ మృతిప‌ట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన్ న‌ఖ్వీ సంతాపం తెలిపారు. సయీద్ అహ్మద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు.