NTV Telugu Site icon

Margani Bharath: ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా..?

Margani Bharath

Margani Bharath

Margani Bharath: వైసీపీ సోషల్ మీడియాపై కేసులు పెట్టడాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. టీడీపీ- జనసేన చేసిన సోషల్ మీడియా పబ్లిసిటీలో వైసీపీ ది 10 శాతం కూడా లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా.. ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలనా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డిక్టేటర్ షిప్‌లో ఉన్నామా అంటూ మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్కు పట్టుకుని గతం లోకేష్ ఎన్నో అవాకులు చవాకులు మాట్లాడలేదా అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తాట తీస్తాను అనలేదా అంటూ అడిగారు. వైయస్ జగన్ సైకో జగన్ అంటూ ఎన్నోసార్లు మాట్లాడారు.. మీపై ఏ కేసులు పెట్టాలని ప్రశ్నలు గుప్పించారు. టీడీపీ అఫీషియల్ పేజెస్‌లో గత ప్రభుత్వంపై అబద్ధపు రాతలు రాశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిపి దారుణంగా ఇసుకను దోచేస్తున్నారని ఆరోపించారు.

Read Also: Minister Satya Kumar Yadav: బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు కేటాయింపులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం

మూలగొయ్యిలో యువకుడిపై దాడి చేశారని.. ప్రత్యక్షంగా వీడియోలు కూడా ఉన్నాయని… అయినా పోలీసుల వద్ద నుండి స్పందన లేదన్నారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా… నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనలో ఉన్నట్టుందని అన్నారు. కచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ప్రజల వాయిస్ వినిపిస్తామన్నారు. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై దాడులు చేయటం… ప్రజాస్వామ్యానికి విఘాతమన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేయటం … ఏ కోర్టులో ఎక్ హాజరు పరుస్తున్నారో కూడా తెలియటం లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు.

 

Show comments