గేదెను ట్రాలీ ఎక్కిస్తున్న ఓ వీడియోను షేర్ చేశారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. గేదెను ట్రాలీకి కట్టి.. దానిని వెనకనుంచి తన్నగానే వెంటనీ ట్రాలీలోకి ఎక్కేసింది.. ఇక, ఇలాంటి ట్రీట్‌మెంట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అవసరం అంటూ ఆయన కామెంట్ రాసుకొచ్చారు.. అంతేకాదు.. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్, తెలంగాణ బీజేపీని ట్యాగ్ చేసి ఆ ట్వీట్ చేశారు.