NTV Telugu Site icon

Jaggareddy: డాటా సరిగ్గాలేక రుణమాఫీ ఆలస్యమైంది.. దీంట్లో దాచుకునేది ఏముంది?

Jaggareddy

Jaggareddy

కాంగ్రెస్.. రాహూల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రుణమాఫీ చేశారని.. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా… 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి తీర్మానం చేసి… 18 వేల కోట్లు బ్యాంకుల ఖాతాలో వేశారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 8 నెల్లలోపే రుణమాఫీ చేశామని.. మిగిలినవి డాటా సరిగా లేక ఆలస్యం అవుతుందన్నారు. దీంట్లో దాచుకునేది ఏముంది? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఇందిరాపార్క్ దగ్గర రుణమాఫీ జరగలేదు అని దీక్ష చేశారని.. తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా ఉనికి పెంచుకునే పనిలో పడిందన్నారు. బీజేపీ.. కాంగ్రెస్ మీద బురద జల్లె పనిలో పడిందని అన్నారు. తమపై విమర్శించే హక్కు బీజేపీకి లేదని విమర్శించారు.మోడీ.. ఎన్నికల సమయంలో నల్లదనం తెచ్చి ప్రతీ పేదవాడి అకౌంట్ లో వేస్తా అని చెప్పలేదా? అని ప్రశ్నించారు.

READ MORE: Sabitha Indra Reddy : కొండా సురేఖ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్..

పదేండ్లు బీజేపీ.. అధికారంలో ఉండి పేదల అకౌంట్‌లోకి చిల్లి గవ్వ అయిన వేశారా? అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారని.. 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే.. చర్చకు సిద్ధంగా ఉన్నారా..? అన్ని సవాల్ విసిరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారని.. సమాధానం ఉందా? అని ప్రశ్నించారు. ” దేశ రైతుల నడ్డి విరిచేలా నల్ల చట్టాలు తెచ్చింది నిజం కాదా..? దీక్షలు చేస్తున్న రైతులను తొక్కి చంపిన చరిత్ర మీది కాదా..? ధరలు తగ్గిస్తామని చెప్పి.. డబుల్ చేశారు నిజం కాదా..? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తులం బంగారం 28 వేలు.. మోడీ అధికారంలోకి వచ్చాకా.. రూ. లక్షకు తులం అయ్యింది. వీటికి తెలంగాణా బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా..? ” అని ఫైర్ అయ్యారు.

READ MORE:Israel-Iran War: ఇరాన్ భయంకరమైన తప్పు చేసింది.. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు

తులం బంగారం రూ. లక్ష చేసినా.. తెలంగాణలో మహిళలు 8 మంది ఎంపీలను గెలిపించారని మజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. “ఎందుకు అనే ఆలోచనే చేయలేదా ప్రజలు.. బాధ అనిపించడం లేదా..? గ్యాస్ ధర పెంచారు.. కోపం రావడం లేదా.. పెట్రోల్..డీజిల్ ధరలు పెంచినా.. కోపం రావడం లేదా..? ధరలు పెంచినా.. ఓటేస్తారు అని బీజేపీ వాళ్లకు కండ్లు నెత్తికి ఎక్కినయ్..
బీజేపీ వాళ్ళ లెక్క డ్రామాలు వేయడం రాదు. కాంగ్రెస్ నేతలు ప్రాక్టికల్ గా ఉంటాం.. బీజేపీ నేతలు నటనలో పుట్టి..నటనలో పెరిగారు” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.