French Open 2025 Winner: మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
French Open 2025 Winner: స్పెయిన్ యువ టెన్నిస్ దిగ్గజం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో వరల్డ్ నం.1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్ (Jannik Sinner)ను 5 సెట్ల భారీ పోరులో మట్టికరిపించి, తన ఫ్రెంచ్ ఓపెన్ విజయపరంపరను మరోసారి కొనసాగించాడు. ఫైనల్ మ్యాచ్ మొత్తం 5 గంటల 29 నిమిషాలపాటు సాగింది. మొత్తానికి మ్యాచ్ ఫలితం చివరికి 4-6, 6-7(4-7), 6-4, 7-6(7-3), 7-6(10-2) స్కోర్లతో తేలింది. మొదటి రెండు సెట్లలో అల్కరాజ్ వెనుకబడినప్పటికీ, మిగతా మూడు సెట్లను గెలుచుకొని గొప్ప కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఫైనల్ పోరు ఒక్కో పాయింట్ ఒక్కో గేమ్ పాయింట్ గా సాగి ఉత్కంఠను పంచింది.
Read Also: Kannappa : ‘కన్నప్ప’ ఓటీటీ డీల్ పై మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
మ్యాచ్ ఆరంభంలో జెన్నిక్ సిన్నర్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మొదటి సెట్లో 10వ గేములో అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 6-4తో గెలిచాడు. రెండో సెట్ లోనూ ఆరంభంలో 3-0 లీడ్ తీసుకున్నప్పటికీ, అల్కరాజ్ పుంజుకుని సెట్‌ను టై బ్రేకర్‌కు తీసుకెళ్లాడు. కానీ, అక్కడ సిన్నర్ 7-4తో విజయాన్ని అందుకున్నాడు. అలా రెండు సెట్లు కోల్పోయిన తర్వాత అల్కరాజ్ నుంచి ఓ అద్భుతమైన ఆట తీరు బయటకు వచ్చింది. మూడో సెట్‌ను 6-4తో గెలిచి మ్యాచ్ లోకి తిరిగొచ్చాడు. నాలుగో సెట్‌ను ట్రై బ్రేకర్‌లో 7-6(7-3)తో కైవసం చేసుకున్నాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్‌కు దారితీసింది.
Read Also: Job Notification: హెల్త్ డిపార్ట్మెంట్లో భారీగా ఉద్యోగాలు.. జి.ఓ. విడుదల..!
ఐదో సెట్‌లో కూడా ఇద్దరి మధ్య పోరు సమంగా సాగింది. చివరకు సెట్ మళ్లీ టై బ్రేకర్‌కు వెళ్లగా, అల్కరాజ్ 10-2తో ఘన విజయం సాధించాడు. ఈ గెలుపుతో అతను వరుసగా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడాడు. ఈ విజయంతో కార్లోస్ అల్కరాజ్ తన ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే అతను యూఎస్ ఓపెన్ (2022), వింబుల్డన్ (2023, 2024), ఫ్రెంచ్ ఓపెన్ (2024) టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. రెండు సెట్లు కోల్పోయినప్పటికీ పట్టుదలతో తిరిగొచ్చి టైటిల్ గెలవడం అద్భుతం. అభిమానులకు ఇది మరపురాని మ్యాచ్‌గా మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!