Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: పోలీసు కస్టడీకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..!

Kakani

Kakani

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.. 6వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు కస్టడీకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకాణి తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని జడ్జి సూచించారు.

READ MORE: Amarnath Yatra: 581 పారామిలిటరీ బలగాలు, డ్రోన్లు, జామర్లు.. అమరనాథ్ యాత్రకు భారీగా భద్రత ఏర్పాట్లు..!

కాగా.. గత ప్రభుత్వ హయాంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్ది క్వార్ట్జ్‌ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్‌ అధికారి బాలాజీనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్‌ అధికారి పేర్కొన్నారు.. ప్రశ్నించిన గిరిజనులను బెదిరించారన్నారన్నారు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ముందస్తు బెయిలు పిటిషన్‌తో పాటు తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. ముందస్తు బెయిలు పిటిషన్‌ వేసినా ఎదురుదెబ్బే తగిలింది. దీంతో గత రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు ఇటీవల కేరళలో ఏపీ పోలీసులకు చిక్కారు. తాజాగా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు కస్టడీకి అప్పగించింది.

READ MORE: Ritu Varma : సినిమా ప్లాప్ అయితే హీరో, హీరోయిన్లపై నిందలు.. రీతూవర్మ కామెంట్స్

 

Exit mobile version