మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.. 6వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు కస్టడీకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకాణి తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని జడ్జి సూచించారు.
ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్‌ను లండన్ కోర్టు మళ్లీ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారత మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన నీరవ్ మోడీ 2019 మార్చి నుంచి యూకే జైల్లో ఉన్నాడు.