NTV Telugu Site icon

Ambati Rambabu: చిరంజీవి తమ్ముడు కాకపోతే పవన్ పరిస్థితి ఏంటి?

Ambati Rambabu

Ambati Rambabu

తమ పార్టీ నుంచి వాళ్ల పార్టీకి బాలినేని అలిగి వెళ్ళారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “నా ఆస్తులు నాశనం చేసుకున్నాను అంటారు.. జగన్ నా దోపిడీ చేసారు అని చెప్పటానికి సిగ్గులేదా.. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలు చెబుతున్నా అని మాట్లాడారు.. బాలినేని, సాయిరెడ్డి ఇద్దరు జగన్ పక్కన ఉండి రాజకీయాలు చేయలేదా.. ఇలాంటి వాళ్ళను నమ్మి పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే ఇంక అంతే సంగతులు.. వేదిక దొరికింది కదా అని ఇంకొక ఆయన మాట్లాడారు.. దుర్మార్గమైన రాజకీయాలు దయచేసి చేయొద్దు.. అలా చేశారా మీకు నూకలు మిగలవు. నాగబాబు జగన్ కామెడీ అంటున్నారు.. మీరు ఇక్కడి వరకు రావటానికి 16 ఏళ్లు పట్టింది.. ఢిల్లీ పీఠానికే భయపడని జగన్.. జగన్ వైఎస్ఆర్ కొడుకు కాకుంటే ఏమయ్యే వారు అన్నారు..” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: Janasena: జనసేన సభ నుంచి వెళ్తూ కార్యకర్త హఠాన్మరణం.. స్పందించిన పవన్ కళ్యాణ్

చిరంజీవి తమ్ముడు కాకపోతే పవన్ పరిస్థితి ఏంటి అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. “ఇవాళ అధికారం ఉంది.. డబ్బు ఖర్చు పెట్టారు.. జనం వస్తారు.. దీన్ని చూసి జబ్బలు చరుచుకోవాల్సిన పనిలేదు.. దశా.. దిశా లేని సభ.. చెప్పాలనుకుంది చెప్పుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ ఏంటనేది క్లైమాక్స్ తెలుస్తుంది.. చంద్రబాబుకు ఊడిగం చేయటం కోసమే పవన్ కాపులను ఉపయోగించుకుంటున్నారు.. నాగబాబు కలలు కంటున్నారు.. పవన్ నిస్వార్థ జీవి అన్నారు.. మీకు పదవి ఇవ్వగానే అన్నీ అందరికీ అర్థమయ్యాయి.. ఏరు దాటాక తెప్ప తెగలేసినట్లు వర్మపై మాట్లాడారు.. ఎన్నికల సమయంలో వర్మ చేతిలో చెయ్యి వేసి నన్ను గెలిపించాలని అన్నారు.. ఇప్పుడు వర్మ.. మీ ఖర్మ అంటున్నారు.. కనీసం గౌరవం అయినా ఇవ్వాలి కదా.. పిఠాపురం మీ అడ్డా అనుకుంటున్నారు.. అక్కడ మీరు మొదటి సారే గెలిచారు.. దక్షిణాది మొత్తం అంటూ ఒక కర్చీఫ్ వేసేసారు.. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరులా మారిపోయారు..” అని అంబటి ప్రశ్నించారు.