NTV Telugu Site icon

Jammu Kashmir: జమ్ములో కాంగ్రెస్ తో నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు! బీజేపీ పరిస్థితేంటి?

Farooq Abdullah

Farooq Abdullah

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, జేకే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. సాయంత్రంలోగా పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆగస్టు 20 నుంచి జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ ఓటింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీగా నిర్ణయించారు. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 18న తొలి దశ పోలింగ్‌ జరగనుంది. ఇందులో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18న జరగనున్న తొలి దశ ఓటింగ్‌లో 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో 16 సీట్లు కాశ్మీర్ లోయ నుంచి, 8 సీట్లు జమ్మూ ప్రాంతం నుంచి ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించవచ్చు. 90 స్థానాలకు మూడు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనున్నాయి.

READ MORE: PM Modi: పోలాండ్ నుంచి ఇజ్రాయెల్, రష్యాకు ప్రధాని కీలక సలహా..

చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు..
2014 తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇదే తొలి అసెంబ్లీ ఎన్నికలు. 2014లో రాష్ట్రంలోని 87 అసెంబ్లీ స్థానాలకు ఓట్లు పోలయ్యాయి. అప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 28 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 15 సీట్లు, కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకి అవసరమైన 44 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ కూడా చేరుకోలేకపోయింది. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత మొదటి, ద్వితీయ స్థానాల్లో ఉన్న పార్టీలైన పీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

READ MORE:E-SHRAM: కార్మికుల కష్టానికి “ఈ-శ్రమ్” సాయం.. ఈ కార్డు మీతో ఉంటే నెలకు రూ. వెయ్యి!

బీజేపీ ముందున్న సవాళ్లు ఏమిటి?
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం… జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ ముందు ఉన్న పెద్ద సవాలు స్థానిక పార్టీలు, కాంగ్రెస్. జమ్మూ డివిజన్‌లో బీజేపీని 20 సీట్లకు తగ్గించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. తద్వారా అసెంబ్లీలో స్థానిక పార్టీలతో కలిసి ప్రభుత్వంలో ఏర్పాటు చేయవచ్చని పావులు కదుపుతోంది. స్థానికంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు కనిపించాయి. గత నెలలో బీజేపీ పరిస్థితి మరింత మారిపోయింది. పలువురు స్థానిక నాయకులు పార్టీని వీడినట్లు సమాచారం. జమ్మూ డివిజన్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది బీజేపీ కల. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని సమాచారం.