బీహార్‌లో విపక్ష కూటమి మళ్లీ కలవబోతుందా? మునుపటి స్నేహమే కొనసాగించబోతున్నారా? ఎన్నికల ముందు మాస్టర్ ప్లాన్ వేశారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవే సంకేతాలు వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఏకతాటిపై ఉన్న కూటమి.. సీట్ల పంపకాల్లో తేడాలు రావడంతో చివరి నిమిషంలో ఎవరికి వారే వేరైపోయారు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, జేకే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.