Tirumala Darshan : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం నాడు మరింత పెరిగింది. ముఖ్యంగా వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు రాక భారీగా ఉంది. ఇక శనివారం నాడు తిరుమల లోని వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో కంపార్టుమెంట్లలన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికార వర్గాలు తెలిపాయి. శనివారం నాడు శ్రీవారిని 74,467 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 40005 మంది భక్తులు తలనీలాలు సంపర్పించారు.
Mallu Bhatti Vikramarka: మూసీ నది ప్రక్షాళనకు నిధులివ్వండి.. కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి విజ్ఞప్తి
ఇక శనివారం నాడు స్వామి వారి హుండీ ఆదాయం 3.77 కోట్లుగా తేలింది. ఇక క్యూ కాంప్లేక్స్ లో కంపార్టుమెంట్లలలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు పాలు, అల్పహారం లాంటి వాటిని అందిస్తూనే ఉన్నారు. సామాన్య భక్తుల శ్రీవారి దర్శనం కల్పించేందుకు కోసం జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారంలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీఐపీ నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సుల లేఖలను కూడా స్వీకరించబడవని అధికారులు స్పష్టం చేసింది.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే?