కేంద్ర ప్రభుత్వ విద్య సంస్థ నవదయ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఈ విద్యాసంస్థ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం 1,377 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, వాటికీ ఎలా దరఖాస్తు చేయాలి..? అలా అన్ని వివరాలను చూస్తే..
Also read: Titanic Watch Action: వేళల్లో కోట్లకి అమ్ముడుబోయిన టైటానిక్ ప్రయాణికుడి వాచ్.. ఎన్ని కోట్లంటే..
నవోదయ విద్యాలయాల్లో మొత్తం 1377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫలితంగా డిప్యూటీ అసిస్టెంట్, నర్సు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, లేబర్, ఎంటీఎస్ వంటి వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ, 12వ తరగతి, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, సంబంధిత విభాగాల నుండి పీజీ, డిగ్రీ, లేదా పని అనుభవం కలిగి ఉండాలి.
Also Read: Vijay Devarakonda :ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న రౌడీ హీరో..?
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి ఏప్రిల్ 30 చివరి రోజు. వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ మొదలైన వాటి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే .. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ నగరాలూ తెలంగాణాలో.., అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో ఆంధ్రప్రదేశ్ లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ ను చూడండి.