Millet Breakfast Recipes: రుచిలో అదుర్స్.. పోషకాల్లో నెంబర్ 1! ఇన్స్టంట్‌గా రెడీ చేసుకునే బెస్ట్ రాగి బ్రేక్‌ఫాస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Millet Breakfast Recipes: ఈ రోజుల్లో హెల్త్ గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో అనేక అవస్థలు ఎదుర్కొనే వచ్చే అవకాశం ఉంది. మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారాలి. ప్రతిఒక్కరి రోజు వారి డైట్‌లో ఆరోగ్యకరమైన ఆహారాలను భాగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో హెల్తీ ఆప్షన్స్ కోసం వెతికే వారికి రాగి పిండి ఒక అద్భుతమైన ఎంపిక. పప్పులు నానబెట్టే పని లేకుండా, పిండిని పులియబెట్టే అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో చేసుకునే రెండు అదిరిపోయే రాగి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
ఇన్స్టంట్ రాగి ఇడ్లీ ..
సాధారణ ఇడ్లీల కంటే ఇవి ఎంతో రుచిగా, సాఫ్ట్‌గా ఉంటాయి.
తయారీ విధానం: ముందుగా ఒక పాన్‌లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు (శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర), పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి, ఆపై ఒక కప్పు రాగి పిండి కూడా వేసి కాసేపు వేడి చేయాలి. ఈ మిశ్రమం చల్లారాక, అందులో ఒక కప్పు పులిసిన పెరుగు, సరిపడా ఉప్పు, నీళ్లు కలిపి 15-20 నిమిషాలు నానబెట్టాలి. చివరగా అర టీస్పూన్ వంట సోడా కలిపి, ఇడ్లీ పాత్రలో 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికిస్తే మెత్తని రాగి ఇడ్లీలు సిద్ధం.
క్రిస్పీ రాగి దోశ..
రవ్వ దోశ లాగే చాలా పల్చగా, కరకరలాడుతూ ఉండే ఈ దోశ డైట్ చేసేవారికి బెస్ట్ ఛాయిస్.
తయారీ విధానం:
మిక్సీ జార్‌లో ఒక కప్పు రాగి పిండి, అర కప్పు బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, కొంచెం పెరుగు, ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టి, ఆ తర్వాత అందులో జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు వేసి రవ్వ దోశ పిండిలా పల్చగా కలుపుకోవాలి. పెనం బాగా కాలిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము చల్లి, పిండిని పల్చగా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే క్రిస్పీ రాగి దోశ రెడీ.
ఈ రెసిపీలు ఎందుకు ప్రత్యేకం అంటే..
రాగిలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. అలాగే పప్పులు నానబెట్టడం లేదా రుబ్బడం వంటి శ్రమ ఏమీ లేదు కాబట్టి సమయం కూడా ఆదా అవుతుంది. వీటికి టమాటా చట్నీ లేదా కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్. కుదిరితే ఒకసారి ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ను మీ ఇంట్లో ట్రై చేయండి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..