ఫ్లిప్ కార్ట్ సేల్ లో సిమ్రాన్ పాల్ సింగ్ అనే వ్యక్తి రూ. 51వేలు విలువైన ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు. కొత్త ఐఫోన్ కోసం ఆశగా^ఎదురు చూశాడు. పార్శిల్ రానే వచ్చింది. దాని కోసమే ఎంతో ఆశగా చూస్తే.. అతను సంతోషంతో ఎగిరి గంతేశాడు. పార్శిల్ తీసుకున్నాడు. కొత్త ఫోన్ వచ్చేసిందని సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు. ఆత్రంగా పార్శిల్ ఓపెన్ చేసి.. చూపి షాక్ అయ్యాడు. ఉత్సాహం అంతా నీరు గారిపోయింది.
కొత్త ఫోన్ చూద్దామని ఒళ్లంతా కళ్లు చేసుకుని గబగబా ఆత్రంగా పార్శిల్ ఓపెన్‌చేసి చూస్తే షాక్… దాంట్లో ఐఫోన్ 12 లేదు. రెండు నిర్మా సబ్బులు కనిపించాయి. పాపం ఏం చేయాలో అర్ధం కాలేదు. గాబరా పడిపోయాడు. అయితే… పార్శిల్ ఓపెన్ చేసేటప్పుడు అతను చేసిన పని మంచిదే అయింది. పార్శిల్ ఓపెన్ చేసేటప్పుడు సరదగా గుర్తుగా ఉంటుందని తన పాత ఫోన్ తో వీడియో రికార్డు చేశాడు. అదే అతనికి చక్కటి సాక్ష్యం అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.