Flipkart Big Billion Days Sale 2024 Discounts: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ తేదీలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి సేల్ ఆరంభం కానుంది. ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 26) సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందించనునట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. తాజాగా కొన్ని మొబైల్స్‌పై డీల్స్‌ను రివీల్ చేసింది.
బిగ్ బిలియన్ డేస్ 2024లో గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.75,999 కాగా.. సేల్‌లో రూ.40,000 కంటే తక్కువ ధరకే లభించనుంది. అంటే 30 వేలకు పైగా రాయితీ లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ను రూ.40వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర 55,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ బేస్ వేరియంట్ రూ.30వేల లోపే లభించనుంది. పోకో ఎక్స్6 ప్రో 5జీని రూ.20వేల లోపే సొంతం చేసుకోవచ్చు.
Also Read: Kakinada GGH: కామెడీ సీన్స్ చూపిస్తూ పేషెంట్‌కు ఆపరేషన్.. కాకినాడ వైద్యులు ‘అదుర్స్’!
బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్‌లో భాగంగా మరిన్ని మొబైల్స్‌పై కూడా ఆఫర్స్ ఉన్నాయి. సీఎంఎఫ్ ఫోన్1, నథింగ్ ఫోన్2ఏ, వివో టీ3ఎక్స్, పోకో ఎం6 ప్లస్, ఇన్ఫినిక్స్ నోట్40 ప్రో లాంటి మొబైల్స్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ.50 తగ్గింపు ఉంటుంది. దాంతో మొబైల్ ప్రియులకు ముందుగానే ‘దసరా’ పండగ వస్తుందని చెప్పాలి.