ఓ హిందూ కుటుంబం పాకిస్థాన్‌లోని కరాచీలో ఫుడ్‌స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ‘కవితా దీదీస్ ఇండియన్ ఫుడ్’ పేరుతో కవిత అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నడుపుతోంది. కాగా.. ఒక పాకిస్థాని ఫుడ్ వ్లాగర్ కరాచీలోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న స్టాల్ ను సమీక్షించారు. తన అనుభవాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.
READ MExplosions On Sun: సూర్యుడి పై భారీ విస్పోటనాలు.. విస్పోటనాల ఫోటోలు వైరల్..ORE:
కరామత్ ఖాన్ అనే ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో వీడియోను పంచుకున్నారు. ఇందులో కవితా స్టాల్‌ని సందర్శించిన అనుభవం గురించి చెప్పారు. “హిందూ కుటుంబం ఇక్కడ శాఖాహారం, మాంసాహారం రెండింటినీ విక్రయిస్తుంది. ఇక్కడ వీరి స్టాల్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసి భోజనం చేస్తారు. ఈ ఫుడ్ స్టాల్‌లో ఎక్కువగా ఇష్టపడే వంటకాలు పావ్ భాజీ, వడ పావ్, దాల్ సమోసా. కవిత విక్రయించే ప్రతి ఆహార పదార్థాలు రుచికరంగా ఉంటాయి.” అని కరాచీకి చెందిన చాలా మంది ప్రజలు కరామాత్‌ను చెప్పడం వీడియోలో కనిపించింది. కరామత్ మొదటి సారి వడ పావ్ తిని దాని రుచిని మెచ్చుకుంది.
ఆ వీడియోలో కవిత మాట్లాడుతూ.. ‘వడ పావ్ ముంబైలో చాలా ఫేమస్. ఇప్పుడు కరాచీ వాసులు కూడా దీన్ని ఇష్టపడటం మొదలుపెట్టారు. కరాచీలోని ఆహార ప్రియులు హిందూ కుటుంబాలు విక్రయించే ఈ వంటకాలను ఆస్వాదిస్తారని, ప్రజలు వాటిని ‘కవితా దీదీ’ అని పిలుస్తారు.” అని చెప్పారు. కరామత్ వీడియోను షేర్ చేసిన తర్వాత, ‘కవితా దీదీ’ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. వడ పావ్, పావ్ భాజీ వంటి హిందుస్థాన్ వంటకాలపై పాకిస్థానీ ప్రజల ప్రశంసలను విన్న భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు.