సైదాబాద్ అబ్జర్వేషన్ హోం స్టాఫ్ గార్డ్ పై ఐదు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్టాఫ్ గార్డ్ రెహమాన్ పై ఇప్పటి వరకు ఐదుగురు మైనర్ బాలుర తల్లిదండ్రులు సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మైనర్ బాలుర పై లైంగిక దాడి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలురపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు స్టాఫ్ గార్డ్ రెహమాన్. ఒక్కొక్కరుగా రెహమాన్ అరాచకాల పై ఫిర్యాదులు చేస్తున్నారు బాధిత మైనర్ బాలురు. మొత్తం పది మంది మైనర్ బాలుర పై అసహజ లైంగిక దాడికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. రెహమాన్‌ను కస్టడీలోకి తీసుకోని విచారించాలని సైదాబాద్ పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.