ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లా ఏక్వారీ అడవుల్లో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో పోలీసులు ఓ నక్సలైట్ ను హతం చేశారు. గంటల తరబడి ఈ కాల్పులు కొనసాగాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు రైఫిళ్లు, మావోయిస్టులు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బోరై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకవారి అటవీప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో కాల్పులు జరిపినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Read Also: Minister Harish Rao: మ్యానిఫెస్టోలో చెప్పినవి.. చేసింది కేసీఆర్ మాత్రమే..
ధామ్‌తరి ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర ఎస్‌డీఓపీ మయాంక్ రాంసింగ్ నేతృత్వంలో కూంబింగ్ నిర్వహించారు. దీంతో జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు రావడం చూసి నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువైపులా దాదాపు 880 రౌండ్ల బుల్లెట్లు పేల్చారు. ఈ ఎన్కౌంటర్ లో కొంతమంది నక్సలైట్లు గాయపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే మృతిచెందిన నక్సలైట్ వివరాలు ఇంకా తెలియరాలేదని.. ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు రాయ్‌పూర్ రేంజ్ ఐజీ తెలిపారు.
Read Also: Mukesh Ambani: డిసెంబర్ నాటికి దేశమంతా జియో 5జీ.. “జియో ఎయిర్ ఫైబర్” లాంచింగ్ డేట్ ఫిక్స్..
మరోవైపు నక్సలైట్ల వ్యతిరేక ప్రచారాన్ని పోలీసులు నిరంతరం నిర్వహిస్తున్నామని, ఎక్వారీ అడవుల్లో నక్సలైట్లు ఉన్నట్లు సమాచారం అందిందని ధామ్‌తరి ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. దీంతో ధామ్‌తరి పోలీసులు, గరియాబంద్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్ల సంయుక్త బృందం అడవికి వెళ్లింది. పోలీసు సిబ్బందిని చూసిన నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారని పేర్కొన్నారు. ఆ తర్వాత జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారని.. ఓ నక్సలైట్‌ని జవాన్లు హతమార్చారన్నారు.
